150
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలంటూ గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఐదవ రోజు విజయవాడ ధర్నా చౌక్ లో భారీ ఎత్తున అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్ కు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మరియు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శిబిరానికి వచ్చి బాసటగా నిలుస్తామని అన్నారు. ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మాట్లాడుతూ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీకి జీతాలు పెంచడానికి ఎందుకు ఆలోచిస్తున్నారన్నారు. అప్పు చేసిన డబ్బులు ఏం చేశారని ప్రశ్నించారు.
Read Also..
Read Also..