తిరుపతి జిల్లాలో కారు – స్కూటీని ఢీ కొనడంతో ఒక వ్యక్తి మరణించాడు. నాయుడుపేట జాతీయ రహదారి మల్లం కూడలి వద్ద కారు – స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మాల ప్రాంతానికి చెందిన నాగరాజు మృతి చెందాడు. నాగరాజు స్కూటీపై రోడ్డు దాటుతున్న క్రమంలో నెల్లూరు వైపు నుంచి చెన్నైకి వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ప్రమాదంలో నాగరాజు అక్కడికక్కడే మరణించారు. కారు స్కూటీని ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.
Read Also..
Read Also..