ఆ పార్టీ అబద్ధాల ముందు మన పార్టీ అభివృద్ధి…

KTR

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు మన పార్టీ అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు&period; మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు&period; తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పని చేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు&period; పదేళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని… కానీ ఆరు లక్షలకు పైగా ఇచ్చామని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73 శాతం వరకు పెంచామన్నారు&period; 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు&period; అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు&period; బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు&period; బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల సౌకర్యం కోసం చూసిందే తప్ప రాజకీయ ప్రయోజనం కోసం ఆలోచించలేదన్నారు&period; అయినా ప్రజలు తమను పూర్తిగా తిరస్కరించలేదన్నారు&period; మూడోవంతు సీట్లను గెలుచుకున్నామని గుర్తు చేశారు&period; 14 స్థానాల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయామన్నారు&period; కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌కు ఓట్ల తేడా కేవలం 1&period;85 శాతమేనని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ… లోక్ సభ వరకు బీఆర్ఎస్‌కు బలమైన నాయకత్వం ఉందని కేటీఆర్ అన్నారు&period; అన్నింటికి మించి మనకు కేసీఆర్ వంటి నేత ఉన్నారని పేర్కొన్నారు&period; ఎవరూ నిరుత్సాహపడవద్దని… అందరినీ కలుపుకొని ముందుకు సాగుదామని పార్టీ శ్రేణులకు సూచించారు&period; అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలను చేపడదామని తెలిపారు&period; గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు… పోడు పట్టాల పంపిణీ సహా అనేక పథకాలు అందించినా ఆ ప్రాంతాల్లో ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వలేదన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..