దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్ము రేపాయి. మదుపరులపై లాభల వర్షం కురిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య మన మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం ప్రారంభమైన కొన్ని నిమిషాలకే బీఎస్ సెన్సెక్స్ 343 పాయింట్లు వృద్ధి చెందింది. మధ్యలో కొంత తగ్గినట్లే తగ్గి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి 719 పాయింట్లు బలపడి 66,876 పాయింట్ల వద్ద తన పరుగు ముగించింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజీ -నిఫ్టీది కూడా అదే బాట. ప్రారంభంలోనే 104 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో కాస్త తగ్గినట్లే తగ్గిన నిఫ్టీ మళ్లీ ఊపందుకుంది. చివరకు 207పాయింట్లు పెరిగి 20,097 వద్ద నిఫ్టీ ముగిసింది. ఫైనాన్స్, పవర్, ఫార్మా, ఆటో షేర్లు దుమ్మురేపాయి. వడ్డీరేట్లను ఇప్పట్లో మరింత పెంచాల్సిన అవసరం కనిపించడం లేదని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ మార్కెట్లలో ఉత్సాహం వచ్చింది. మదుపరుల్లో విశ్వాసం నెలకొంది. ఈ ఒక్కరోజే 2 లక్షల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడిదారుల సంపద పెరిగిందని అంచనా.
దుమ్మురేపుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు….
72
previous post