Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Latest News తెలంగాణలో ఎన్నికల హడావిడి…

తెలంగాణలో ఎన్నికల హడావిడి…

by Prakash
Election rush in Telangana

తెలంగాణలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. రేపు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు స్లిప్పులు పంచడం నుంచి.. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత సిబ్బందిని నియమించడం వరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు మొదట్నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. మరో వైపు…. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. పోలింగ్ సందర్భంగా స్కూళ్లకు నేడు, రేపు రెండు రోజులు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. దీంతో నగరంలోని బస్టాండ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా అడ్డాలపై కూలీలు కూడా పెద్దగా కనిపించలేదు. వలస ఓటర్లను సొంతూళ్లకు రావాలని ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు కోరారు. కొద్దిరోజులుగా అభ్యర్థులు కూడా సిటీకి వచ్చి తమ సెగ్మెంట్లలోని ఓటర్లతోనూ ఆత్మీయ సమ్మేళనాలు సైతం నిర్వహించారు. తప్పకుండా వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సిటీలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన వారు నివసిస్తుంటారు. నల్గొండ, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు చెందినవారు ఎక్కువగా ఎల్​బీనగర్‌, సాగర్‌ రింగ్ రోడ్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాల్లో ఉంటారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు మెహిదీపట్నం వైపు. వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల వారు ఎల్ బీనగర్, ఉప్పల్ వైపు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు లింగంపల్లి, బాలానగర్, బోయిన్ పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో నివసిస్తుంటారు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఈసారి వలస ఓటర్లపై దృష్టి సారించారు. డైలీ ఫోన్లు చేసి ఎప్పడొస్తున్నారని ఆయా పార్టీల లోకల్ లీడర్లు అడుగుతున్నారు. ఓటర్ల జాబితాల్లోని వివరాలు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. పోలింగ్‌ రోజు వచ్చేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు ఓటర్లను తరలించే పనిలో ఉన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: