ఘనంగా జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ…

Giri Pradakshina Seva of Swami

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది&period; గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు&comma; కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు&period; స్వామివారి పాతిక మండపం నుండి ఆలయం చైర్మన్ నివృత రావు&comma; ఈవో వేండ్ర త్రినాథరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రచార వాహనం కొలువు తీరిన స్వామివారి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ముందు కదిలించారు&period; ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు&period; కోలాట భజనలు కేరళ డప్పులతో శక్తి వేషధారణలతో భక్తులను అలరించారు&period; వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ చేసిన ఇంత ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత వివిధ దేవతల అవతారాల రూపంలో వేషాలను వేసి గిరి ప్రదిక్షణలో పాల్గొన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు&period; గిరిప్రదక్షిణ వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ అర్చకులు ప్రత్యేక మేళ తాళాలు&comma; మంగళ వాయిద్యాలు&comma; అర్చకులు&comma; పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి గిరిప్రదక్షిణ సుమారు 6 కిలోమీటర్లు జరిగింది&period; ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులని ఇచ్చారు&period; అనంతరం క్షేత్రంలో తిరుగాడి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు&period; ఆ తర్వాత హారతులు సమర్పించారు&period; ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను విచిత్ర వేషధారణలు&comma; నృత్యాలు&comma; భజనలు&comma; శక్తి వేషలు వెంకటేశ్వర స్వామి వివిధ దేవుళ్ళ వేషధారణలు ప్రత్యేకముగా విశేషంగా ఆకట్టుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్