మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతం

Murudeshwar

Advertisements

&NewLine;<p>మురుడేశ్వర్ చరిత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది&period; ప్రపంచంలోని శివ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహం ఇక్కడ ఉంది&period; మురుడేశ్వర్ కర్నాటక రాష్ట్రంలో పశ్చిమ తీర ప్రాంతంలో ఉంది&period; ఈ ప్రదేశం భారత పురాణాలలో ప్రసిద్ధి చెందిన రామాయణ కాలం నాటిదని చెపుతారు&period; అతిపెద్ద శివ విగ్రహం పట్టణం అంతా కనపడే రీతిలో ఇక్కడి బీచ్ లో ప్రతిష్టించారు&period; సుందరమైన&comma; పచ్చటి పచ్చిక బయళ్ళతో కల ఒకచిన్న కొండపై శివుడి అతిపెద్ద విగ్రహం ప్రతిష్టించబడినది&comma; నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు&period; మురుడేశ్వర్ సందర్శించేవారికి ఈ శివ దేవాలయ దర్శనం భక్తులు తమను తాము మరచిపోయే రీతిలో ఒక అత్యంత మధురానుభూతిగా ఉంటుంది&period; ప్రతిష్టాత్మక శివ భగవానుడి విగ్రహంమురుడేశ్వర్ దేవాలయం ప్రధానంగా ఒక ద్వీపంలో ఉండి మూడు పక్కల అరేబియా మహా సముద్రం ప్రవహిస్తుండటంతో ఈ పుణ్య తీర్ధం దేశ విదేశాలలో ఎంతో ప్రాచుర్యం సంతరించుకొంది&period; మహాసముద్ర వాతావరణం కారణంగా&comma; అది సముద్రపు గాలి&comma; వర్షాలు&comma; మరియు పెను గాలులకు ప్రభావించబడింది&period; అతి పెద్దదైన శివ భగవానుడి విగ్రహం కొంతమేరకు దాని సహజ అందం కోల్పోయింది&period; దానిపై మొదట్లో గల ఆకర్షణీయమైన బంగారు పూత పోయింది&period; అంతే కాక విగ్రహంలోని ఒక చేయి విరిగిపోయింది&period; రావణుడు తీవ్ర కోపంతో శివుడి లింగాన్ని తునకలు చేసినపుడు ఒక ముక్క ఈ ప్రదేశంలో పడటంతో&comma; ఈ ప్రదేశంలో నిర్మించిన ఈ దేవాలయం హిందువులకు మతపరంగా ఎంతో పవిత్రత సంతరించుకొంది&period; దేవాలయ ప్రవేశ భాగం ప్రపంచంలోనే అతి పొడవైనదిగా ఉంటుంది&period; ఇతర ప్రధాన ఆకర్షణలు ఈ ప్రదేశంలో దేవాలయమేకాక&comma; సందర్శకులకు అనేక ఇతర ఆకర్షణలు కూడా ఉన్నాయి&period; ఇక్కడి సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది&period; కనుక ఈ సముద్ర ప్రాంతంలో అందరకు ఎంతో సంతోషపరచే స్విమ్మింగ్&comma; బోట్ సవారి&comma; వంటి వివిధ వినోద చర్యలు కూడా చేసి ఆనందించవచ్చు&period; ఎంతో చక్కగా రూపొందించిన ప్రణాళికతో దేవాలయానికి సమీపంలోని మార్గాలు బీచ్ కు వెళ్ళేందుకు పర్యాటకులకు సంసిద్ధంగా ఉంటాయి&period; పర్యాటకులు అలుపూ సొలుపూ లేకుండా ఆహ్లాదకర వాతావరణంలో ఎంతో హాయిగా మెల్లని నడక సాగిస్తూ ఈ చిన్న కొండపైనుండి అద్భుత సూర్యాస్తమయాలు చూసి ఆనందించవచ్చు&period; ఈ ప్రాంతంలో యాత్రికులకు సూర్యాస్తమయం చూసి ఆనందించటం ఒక పెద్ద విశేషంగా భావిస్తారు&period; పిల్లలతో వెళ్ళే కుటుంబాలు ఇక్కడి నీటి మడుగులలో గంటల తరబడి స్విమ్మింగ్ చేస్తూ ఆనందించవచ్చు&period; నీటిపైనే బహుళ అంతస్తుల రెస్టరెంట్లు&comma; డైనింగ్ ప్రదేశాలు ఏర్పరచి పర్యాటకులకు మరచిపోలేని వినోదానుభూతులు కలిగించే ఏర్పాట్లు అద్భుతంగా ఉంటాయి&period; ఇక్కడ అనేక హోటళ్ళు&comma; రిసార్టులు ఎవరి బడ్జెట్ కు సరిపోయే రీతిలో వారికి లభ్యంగా ఉంటాయి&period; మురుడేశ్వర్ ప్రదేశం ఉత్తర కన్నడ జిల్లాలో ఉండటంతో అక్కడకల ఇతర ఆకర్షణలు కూడా మీరు చూసి ఆనందించవచ్చు&period; వాటిలో టిప్పు సుల్తాన్ పునర్నిర్మించిన కోట&comma; సమీపంలోని సహ్యాద్రి కొండలపై గల హిల్ రిసార్ట్ లు&comma; కోస్తా ప్రదేశమైన భట్కల్ వంటివి తనివితీరా చూసి ఆనందించవచ్చు&period; ఈ పొడవైన కోస్తాతీరం మరియు పర్వత శ్రేణుల వెంబడి ఇంకా అనేక ఇతర సహజ ఆకర్షణలున్నాయి&period; ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే అక్టోబర్ మరియు మార్చి నెలలు వాతావరణ పరంగా అనుకూలం&period; ఇక్కడికి వచ్చే పర్యాటకులు భట్కల్ నుండి బోట్లను లేదా ట్రాలర్లను అద్దెకు తీసుకొని నేత్రాని ద్వీపం లేదా పిజియన్ ఐలండ్ లో గంటల తరబడి విహరిస్తారు&period; అయితే&comma; గతకాలంనాటి శిధిలమైన వైభవ చిహ్నాలు మినహా ఇక్కడ మరేమీ కనపడవు&period; మేకలు&comma; పక్షులు మాత్రమే విహరిస్తూంటాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం