కర్నూలు జిల్లా, మంత్రాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చిందని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీ నివాసరావు తెలిపారు. మంగళవారం హుండీ లెక్కింపు పూర్తి కావడంతో 33 రోజుల హుండీ ఆదాయం రూ 4 కోట్ల 15 లక్షల 32 వేల 738 రూపాయలు నగదు, 44 గ్రాములు బంగారం, 3642 గ్రాముల వెండి ఆదాయం వచ్చింది. జనవరి నెల లో ఎక్కువ గా సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భారీ ఆదాయం వచ్చిందని మఠం మేనేజర్ తెలిపారు. శ్రీ మఠం చరిత్రలో ఇంత భారీ మొత్తంలో ఆదాయం రాలేదని ఇదే మొదటిసారి అని శ్రీ మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు తెలిపారు. ఈ నగదును అన్నదానం, జీత భత్యాలు, స్వామి వారి నైవేద్యం, శ్రీ మఠం పరిశుభ్రత కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు.
రికార్డు సృష్టించిన శ్రీ మఠం హుండీ ఆదాయం..
95
previous post