58
ములుగు జిల్లా కేంద్రంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ములుగు మండలం చింతలపల్లికి చెందిన మామిడిపెల్లి భిక్షపతి, ఎనగందుల నరేశ్ గా గుర్తించారు. ములుగు బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనం పై యూ టర్న్ తీసుకుంటుండగా ఏటూరు నాగారం వైపు వెళ్తున్న ఇసుక లారి బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందగా, నరేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీయంకి తరలించారు.