73
తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తామన్న ‘స్వేద పత్రం’ వాయిదా పడింది. ఇవాళ కాకుండా రేపు రిలీజ్ చేస్తామని పార్టీ ప్రకటించింది. తమ పాలనలోని రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు పీపీటీ ద్వారా ప్రజలకు వివరిస్తామని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో కౌంటర్‌గా బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ఇన్నాళ్లు తెలంగాణలో అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని అన్ని వివరాలు స్వేదపత్రం ద్వారా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.