కాకినాడ జిల్లాలో అధికారమే అండగా మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, పొలాలనే కాకుండా ఇరిగేషన్ కాలువల పటిష్టత కోసం వేసిన మట్టిని సైతం తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. సామర్లకోట మండలం పేదబ్రహ్మదేవం గ్రామంలోని గోదావరి కెనాల్ పక్కన కెనాల్ పటిష్టత కోసం ఉంచిన మట్టిని గ్రామ వైసీపీ నాయకుల అండతో అక్రమార్కులు అర్ధరాత్రి సమయంలో జెసిబి తో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో ప్రయివేటు నిర్మాణాల పునాదులకు, ఇటుకుల బట్టీలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం స్థానికంగా ఉండే అధికారులకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజు ఈ మట్టిని పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి లక్షలాది రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ మట్టికి వెయ్యి నుండి రెండువేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Read Also..
అధికారమే అండగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా
84
previous post