ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబెడు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి రాజమ్మ 80 సంవత్సరాలు గల ఆమెకు ఇద్దరి సంతానంలో రెండవ కొడుకు కృష్ణారెడ్డి అతని కొడుకులు కలిసి మంగళవారం మధ్యాహ్నం రాజమ్మతో గొడవ పడుతూ గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం.
ఈ ఆస్తి గొడవకు కారణం ఆమెపై ఒక ఎకరం వ్యవసాయ భూమిని చిన్న కొడుకుకు కృష్ణారెడ్డికి కాదంటూ పెద్ద కొడుకు కుమారుడు హరి రెడ్డికి రాసిచ్చినందున సుమారు రెండు నెలలుగా గొడవలు కొనసాగిస్తూ ఉండడంతో ఇలాంటి దారుణానికి కసాయి కొడుకు, కోడలు హత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. ఇదే విషయంపై ఎస్ ఐ కి రాజమ్మ పెద్ద కొడుకు కుమారుడు హరి రెడ్డి ఫిర్యాదు కొద్ది నిమిషాల ముందు చేయడంతో అప్రమత్తమైన హంతకులు చాలా కిరాతకంగా గొంతు కోసి చంపి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్నారు.