నాసిరకం చేపలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంగపుత్రులు..

fish

Advertisements

&NewLine;<p>జగిత్యాల పట్టణంలోని అన్నపూర్ణ చౌరస్తా వద్ద గంగపుత్ర సోదరులకు జీవనదారం అయిన చేప పిల్లల పంపిణి లో గత ప్రభుత్వం నాసిరకం చేపలు పంపిణి చేసి తమ నోట్లో మట్టి కొట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఏడాది క్రితం జగిత్యాల సమీపంలో గల ముప్పాలా చెరువు&comma; తిమ్మాపూర్ చెరువు&comma; రాజుల చెరువు లో రవ్వులు అనే ఫిష్ సీడ్ ఇస్తామని పేర్కొని సిల్వర్ ఫిష్ అని ఏదో కొత్త రకం చేప సీడ్ పోశారని ఏడాది కాలంగా ఇవి పెరగడం లేదన్నారు&period; రవ్వులు&comma; బొచ్చేలు&comma; బంగారు తీగ సీడ్ ఇస్తామని చెప్పి&comma; చివరికి సిల్వర్ ఫిష్ సీడ్ ఇచ్చారని వీటిని వ్యాపారులు గాని&comma; ప్రజలు గాని కొనడం లేదని తాము నష్టపోతున్నామని వాపోయారు&period; గతంలో నుండి సకాలంలో చేప పిల్లలు పోయాక తాము ఇబ్బదులు ఎదురుకుంటున్నామని&comma; కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; చేప పిల్లల పంపిణితో తమ జీవితాలని మారుస్తామన్నా KCR ప్రభుత్వం&comma; తమను మోసం చేసిందని&comma; కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు&period; నూతన ప్రభుత్వం అయిన మా పరిస్థితి అర్థం చేసుకొని బాధ్యుడైనా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోని&comma; తమకు నాణ్యమైన చేపలు పంపిణి జరిగేలా చూడాలని గంగపుత్రులు అధికారులు&comma; ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.