ఈ నెల 28 నుంచి రూ. 500 కే గ్యాస్ సిలిండర్

Gas cylinder

Advertisements

&NewLine;<p>మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 నుంచే గ్యాస్ సిలిండర్ ను 5 వందలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది&period; కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నికల హామీని అమలు చేయాలని భావిస్తోంది&period; ఇందుకోసం సివిల్ సప్లై శాఖ ఉన్నతాధికారులు విధివిధానాలను రూపొందిస్తున్నారు&period; రాష్ట్రంలో గ్యాస్ వినియోగదారులు ఎంతమంది&comma; ఎవరెవరికి ఈ పథకం వర్తింపజేయాలనేది నిర్ణయించనున్నారు&period; ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఎంతనేది లెక్కలు తీస్తున్నారు&period; అధికార గణాంకాల ప్రకారం తెలంగాణలో 1&period;20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి&period; నెల నెలా 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి&period; రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులు అందరికీ సబ్సిడీ ఇస్తే ఖజానాపై ఏటా రూ&period;3 వేల కోట్ల భారం పడనుందని అంచనా&period; అయితే&comma; రాష్ట్రంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లు సుమారుగా 70 లక్షలు ఉన్నాయి&period; ఈ నేపథ్యంలో మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది&period; అయితే&comma; గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి &OpenCurlyQuote;నేమ్ ఛేంజ్’ ఆప్షన్ ఉండడంతో మిగతా వినియోగదారులు పేరు మార్చుకునే సౌలభ్యం ఉంది&period; ఈ క్రమంలోనే గ్యాస్ సబ్సిడీకి సంబంధించి గైడ్ లైన్స్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..

గెటప్ శ్రీను వాగ్వాదం! “తొక్కలో ఇంటర్వ్యూ” అంటూ వెళ్ళిపోయిన గెటప్ శ్రీను?

నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…