పళ్ళన్నీ ముఖ్యమైనవే అయినా అనాస పండు ప్రత్యేకత కలిగినది. చక్కని రుచి, సువాసన కలిగిన అనాస పండు 85 శాతం నీటిని కలిగి ఉంది. అనాస పండును తింటే మూత్ర పిండాల్లో రాళ్లు కరుగుతాయని ఆహార నిపుణులు తెలుపుతున్నారు. అనాస పండులో విటమిన్ సి అధికంగా ఉంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సంతాన సమస్యలతో బాధపడేవారు అనాస తినడం ఎంతో మంచిది. అనాసలో జీర్ణ వ్యవస్థను వృద్ధి చేసే ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. ఈ పండులో అధికమైన పీచుపదార్థం మలబద్దకానికి మంచి మందుగా పని చేస్తుంది. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత చిన్న అనాస ముక్కను తింటే త్వరగా జీర్ణమైపోతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. అనాస పండును ముక్కలుగా చేసి, తేనెతో కలిపి తింటే శరీరానికి శక్తి మాత్రమే కాదు, మేని ఛాయ కూడా నిగారింపు వస్తుంది. అందాన్ని పెంచుకోవాలంటే అనాస తినండి. ఇది శరీరంపై ఉండే మృతకణాలను నివారించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగినా, తిన్నా ఉల్లాసంగా ఉంటారు. అనాసలోని పొటాషియం రక్త ప్రవాహం సాఫీగా సాగేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. అనాస పండు తినడం వల్ల ఒత్తిడి, మతిమరపు, డిప్రెషన్‌లనీ తగ్గిస్తుంది. పండిన అనాస పండును తింటుంటే పళ్ళ నుండి రక్తంకారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. గొంతు నొప్పి, నోటిలో పుండ్లు ఉన్నట్లయితే, అనాసరసాన్ని నోటిలో కాసేపు ఉంచుకుని మింగేయండి. తప్పకుండా అవి తొలగిపోతాయి. అనాసపండు రసం పచ్చకామెర్లకు మంచి ఔషధం. అనాస కాలేయానికి, మూత్రపిండాల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అనాసలోని కాపర్ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాలను వృద్ధి చేయడానికి సహాయపడుతుంది. అనాసపండులోని మాంగనీస్ ఎముకలు, దంతాలు, కండరాలు, జుట్టు సమస్యలను నివారిస్తుంది.
ఏంటి ఒక్క ఫైనాఫిల్ ముక్కతో ఇంత బెనిఫిట్ ఉందా !
45
previous post