వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో కూర్చొని అందినంత దోచుకున్నారని వారు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు వెండి బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలు..
94
previous post