87
కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రాఘవేంద్ర కాలనీలో మాధవ రెడ్డి(Madhava Reddy), సరిత దంపతులు నివసిస్తున్నారు. సరిత ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. దీంతో, దుండగులు తాళం పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు నగలు, 2లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి