కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిసి KPHB లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని.. ప్రతినిత్యం అందుబాటులో ఉండే వ్యక్తిగా గత పదిఏళ్ల నుంచి వేలకోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చామని నేడు ఎక్కడెక్కడ నుండో వచ్చి కనీసం కూకట్పల్లి నియోజకవర్గంలో ఏ గల్లి ఎక్కడ ఉంటుందో కూడా తెలియని వారు.. నియోజకవర్గ పరిది తెలియని వారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉందని.. దీనిని ప్రజలు గమనించాలని కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి చూసి ఓటు వేయాలని అన్నారు.. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూ అలాగే ఎంతోమంది ఉద్యోగాలు చేసుకునేవారు అన్ని మౌలిక సదుపాయాలతో సుఖసంతోషాలతో జీవిస్తున్నారని దీనంతటికీ కారణం బిఆర్ఎస్ పార్టీ తీసుకున్న విధానాలే కారణమని అన్నారు. అందుకని రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.నే డు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఇదంతా మంత్రి కేటీఆర్ చొరవనేనని దీనిని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా గుర్తించాలని కోరారు. కూకట్పల్లి నియోజకవర్గంలో కేవలం పదేళ్ల కాలంలో ఎన్నో ఫ్లైఓవర్లు.. అండర్పాస్ బ్రిడ్జిలు నిర్మించామని ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా ప్రక్షాలించడానికి ఇంకా అనేక చర్యలు తీసుకున్నామని ఇవన్నీ కొనసాగాలంటే శాంతిభద్రతలు.. హైదరాబాద్ మహానగరంలో ఉండాలంటే కచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని అన్నారు. అలాగే తనకు కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆలోచించి ఓటు వేయండి అభివృద్ధికే పట్టం కట్టండి..
116
previous post