తెలంగాణ శాసనసభ ఎన్నికలలో భాగంగా మంత్రి తన్నీరు హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట పట్టణంలోని అంబిటస్ స్కూల్ 114వ పోలింగ్ స్టేషన్లో మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మంత్రి తన్నీరు హరీష్ రావు బీపీ చెక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్చంద్దంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో కొంత మందకొడిగా ఉన్న గతంకంటే మెరుగ్గా ఉందన్నారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొంత మంది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్దంగా పరిధి దాటి మాట్లాడుతున్నారని, వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నాగార్జున సాగర్ విషయంలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మాట్లాడుతా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ప్రభుత్వం, కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్నారు.
రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటుందో ఆలోచించండి
73
previous post