64
సీఎం జగన్ కు ఓటేసి గెలిపిస్తే తమను బిక్షం ఎత్తుకునే పరిస్థితి తీసుకొచ్చారని అంగన్వాడిలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి మహిళలు చేపట్టిన సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది. ఈరోజు అంగన్వాడి మహిళలు భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో సుమారు లక్షా ఎనిమిది వేలు అంగన్వాడి కుటుంబాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటుతోనే బుద్ధి చెబుతామంటూ వారు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.