సినిమాల ప్రభావం విద్యార్థులపై ఉందనడానికి నిదర్శనం ఇదే…

Inter students attack on 10th class students

Advertisements

&NewLine;<p>పరీక్షలు ముగిసాయి&period; మరికొద్ది గంటలో తమ తమ ఊర్లకి చేరాల్సి ఉన్న విద్యార్థులు అప్పటిదాకా మనసులో కక్ష్యనంతా ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసి తీర్చుకున్నారు&period; అది కూడా మామూలుగా కాదు&comma; సినిమాలు చూసిన ప్రభావంతో ఈ దాడులు చేసుకోవడంతో పాఠశాల విద్యార్థులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు&period;<br>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మ గడ్డ తండా సమీపంలో బాలానగర్ కు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత రాత్రి పదిన్నర గంటల సమయంలో ఇంటర్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థుల పై దాడికి దిగారు&period; ఇటీవల పలుమార్లు విద్యార్థుల మధ్య గొడవలు చెలరేగడంతో కక్ష్య పెంచుకున్న ఇంటర్ విద్యార్థులు సమయం చూసి ఇంటర్ పరీక్షలు ముగిసే సమయంలో తమను అడిగే వారే లేరంటూ పదవ తరగతి విద్యార్థులపై దాడికి దిగారు&period; దీంతో సుమారు 9 మంది పదవ తరగతి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి&period; ఇంత జరిగినా పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ మరుసటి రోజు దాకా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడంతో గాయపడ్డ విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కింది&period; దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీశారు&period; కానీ పాఠశాల ప్రిన్సిపాల్ అవేవీ జరగలేదు అన్నట్టు వ్యవహరించడంతో విద్యార్థి సంఘాల నుండి విమర్శలు ఎదురయ్యాయి&period; విద్యార్థులు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించి సీసీ కెమెరాలు రికార్డు కావడంతో అవి బయటకు వచ్చాయి&period; దీంతో విద్యార్థి సంఘాలు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పాఠశాల వద్దకు చేరుకొని ఘటనకు గల కారణాలు తెలుసుకొని విద్యార్థులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చారు&period; మరోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును కోల్పోతారని పోలీసులు తెలియజేశారు&period; అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ మాత్రం తమ పాఠశాలలో ఎలాంటి ఘటనలు జరగలేదని విద్యార్థులకు మాటా మాటా పెరిగి ఒకరినొకరు తోసుకున్నారని తెల్పడం గమనార్హం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..