రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ సమాధానమిచ్చారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 అవకాశం కల్పించిందన్నారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగం వల్ల నాలుగేళ్లుగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంలేదు. రహదారుల నిర్మాణం లాంటి మౌలిక వసతుల కల్పన కోసం పైసా ఖర్చుచేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వరంగ కార్పొరేషన్లను అడ్డంపెట్టుకొని అప్పులు తీసుకుంటోంది. ఇలా ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోస్తూ మరోవైపు ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తోందన్నారు. రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాలా సీతారమన్ఏ పీ ఆర్ధిక పరిస్థితిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తగిని సలహాలు, సూచనలు అందిస్తున్నామన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితులపై ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ
63