నేడే వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌

ODI World Cup

Advertisements

&NewLine;<p>నెలన్నర రోజులుగా క్రికెట్‌ అభిమానులను అలరిస్తూ వచ్చిన వన్డే ప్రపంచకప్‌ పండుగ ముంగిపు దశకు చేరింది&period; ట్రోఫీ కోసం నేడు జరిగే ఫైనల్‌ పోరులో భారత్‌&comma; ఆస్ట్రేలియా జట్లు తలపడబోతున్నాయి&period; ఐదుసార్లు విశ్వ విజేత అయిన ఆసీస్‌ కొమ్ములు వంచి మూడోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని రోహిత్‌ సేన పట్టుదలతో ఉంది&period; మరోవైపు ఆరోసారి టైటిల్‌ను సొంతం చేసుకోవాలని కంగారూలు కసిగా ఉన్నారు&period; క్రికెట్‌ చరిత్రలో భారత్‌కు ఇది నాలుగో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌&period; అయితే సొంత గడ్డపై మాత్రం రెండోది&period; ఇక ఆస్ట్రేలియాకు ఇది ఎనిమిదో వరల్డ్‌ కప్‌ ఫైనల్‌&period; ఇరుజట్లకు ఇది రెండో టైటిల్‌ పోరు&period; 2003లో గంగూలీ సేనను రికీ పాంటింగ్‌ బృందం చిత్తుగా ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది&period; 20 ఏళ్ల తర్వాత నాటి ఓటమికి బదులు తీర్చుకునే అవకాశం టీమిండియాకు లభించింది&period; ప్రస్తుత సమీకరణాలను బటిచూస్తే భారతజట్టే హాట్‌ ఫేవరెట్‌&period; రోహిత్‌ సేన ట్రోఫీని ముద్దాడాలని కోట్లాదిమంది భారతీయులు కోరుకుంటున్నారు&period; మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మోడీ&comma; ఆసీస్‌ ఉప ప్రధాని రిచర్డ్‌ మార్ల్స్ విశిష్ట అతిథులుగా వస్తున్నారు&period; మైదానంలోని 1&period;30లక్షల మంది ప్రేక్షకులతోపాటు&comma; కోట్లాది క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది&period; మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఎయిర్‌ షో&comma; డ్రింక్స్‌ ఇన్నింగ్స్‌ మధ్యలో సంగీత విభావరి&comma; చివరగా లేజర్‌ షో ప్రదర్శించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..