హిందువులు పవిత్రంగా భావించే గోవులను కొందరు కబేలాలకు అక్రమంగా రవాణా చేస్తున్న కొందరు అక్రమార్కులకు హైవే అడ్డగా మారింది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మొగల్తూరు నేషనల్ హైవేపై గోవులను యదేచ్ఛగా బొలోరా, ఐచర్ వాహనాల పై శ్రీకాకుళం నుండి నాయుడుపేటకు అక్రమంగా గోవులను కబేలాలకు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు మొగల్తూరు నేషనల్ హైవే పై గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అడ్డుకొని జై గోమాత జై గోమాత అంటూ నినాదాలు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన గోవుల అక్రమ రవాణా ఆగడం లేదని, వెంటనే గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవుల పరిరక్షణ కమిటీ, బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొని మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గోవులను కబేలాలకు అక్రమ రవాణా..
74
previous post