Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Devotional తెరుచుకున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

తెరుచుకున్న శ‌బ‌రిమ‌ల ఆల‌యం

by Satya
Sabarimala temple

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆల‌యం తెరుచుకుంది. మండ‌ల పూజ సీజ‌న్ సంద‌ర్భంగా రెండు నెల‌ల పాటు ఆ ఆల‌యాన్ని తెర‌చి ఉంచ‌నున్నారు. అయ్య‌ప్ప ఆల‌యం ఈసారి భ‌క్తుల్ని విశేషంగా ఆక‌ర్షించ‌నున్న‌ది. ఆల‌య ఎంట్రెన్స్‌లో కొత్త‌గా రాతి పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఆ శిల‌లు భ‌క్తుల్ని స‌మ్మోహ‌న ప‌ర‌చ‌నున్నాయి. ప్ర‌స్తుతం ఆల‌యం ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన విశ్వ స‌ముద్ర అనే నిర్మాణ సంస్థ ఆ రూఫ్‌ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆ కంపెనీ 70 ల‌క్ష‌లు కేటాయించింది. శిల‌ల‌పై అంద‌మైన బొమ్మ‌ను చెక్కారు. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప అని ఆ పిల్ల‌ర్స్‌పై కార్వింగ్ చేశారు. ఆల‌యంలోని 18 బంగారు మెట్లు ఉండే ప‌దినిట్టం పాడిపై హైడ్రాలిక్ రూఫ్‌ను నిర్మిస్తున్నారు. వ‌ర్షం లేని స‌మ‌యంలో ఆ రూఫ్‌ను ఫోల్డ్ చేసే రీతిలో త‌యారు చేశారు. చెన్నైకి చెందిన క్యాపిట‌ల్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ దాన్ని డిజైన్ చేసింది. ప‌డి పూజ స‌మ‌యంలో ఆ రూఫ్ వ‌ల్ల ఇబ్బంది ఉండ‌ద‌ని ఆల‌య అధికారులు చెబుతున్నారు. మండ‌ల దీక్ష కోసం ఆల‌యాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచ‌నున్నారు. డిసెంబ‌ర్ 27వ తేదీన ఆ సీజ‌న్ ముగుస్తింది. మ‌క‌ర సంక్ర‌మ‌ణ పండుగ కోసం డిసెంబ‌ర్ 30వ తేదీన మ‌ళ్లీ ఆల‌యాన్ని ఓపెన్ చేస్తారు. జ‌న‌వ‌రి 15వ తేదీన భారీ సంఖ్య‌లో భ‌క్తుల్ని ఆల‌య ద‌ర్శ‌నం చేసుకోనున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014011
Total views : 78809

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.