Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Devotional లాల్‌దర్వాజ బోనాలకు భారీ భద్రత.

లాల్‌దర్వాజ బోనాలకు భారీ భద్రత.

by CVR NEWS

హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు జరిగే బోనాల సందర్భంగా వందకు పైగా సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీతో కూడిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు డ్రోన్లను సైతం వినియోగిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. జాతరకు వచ్చే భక్తులు కూడా పోలీసులకు సహకరిస్తున్నారని సీపీ తెలిపారు. టెక్నాలజీ ఆధారంగా పోలీసింగ్‌ను మరింత పటిష్ఠం చేశామని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనాల జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామంటున్న సీపీ సజ్జనార్‌తో మా ప్రతినిధి తేజశ్విని ఫేస్ టు ఫేస్ట్

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: