జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో 80 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. లలిత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో భారీగా నగదు ఆదాయం సమకూరింది. మొత్తం 1 కోటి 62 లక్షల 16 వేల రూపాయల నగదు హుండీ ద్వారా వచ్చినట్లు ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. దీంతో పాటు విదేశీ కరెన్సీకి చెందిన 133 నోట్లు కూడా హుండీలో లభించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో 200 రూపాయల విలువైన రెండు నకిలీ నోట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇదే సమయంలో పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో దర్శనమిచ్చాయి. 500 రూపాయల నోట్ల మాదిరిగా ఉన్న ఐదు బొమ్మ నోట్ల బండిల్స్ రెండు లభించగా.. వాటి విలువ 2.50 లక్షల రూపాయలుగా గుర్తించారు. అధికారులు వాటిని పరిశీలించి అసలు కరెన్సీ కాదని నిర్ధారించారు. హుండీలో లభించిన వెండి, మిశ్రమ బంగారు వస్తువులను కూడా లెక్కించి నమోదు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కొండగట్టు ఆలయంలో 80 రోజుల హుండీ లెక్కింపు.
13
previous post