Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Latest News పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్‌ నుంచి హెరాయిన్ నిందితుడు పరారీ.

పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్‌ నుంచి హెరాయిన్ నిందితుడు పరారీ.

by CVR NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో హెరాయిన్ విక్రయం కేసులో పట్టుబడిన నిందితుడు ఎక్సైజ్ పోలీసుల కస్టడీ నుంచి పరారయ్యాడు. పటాన్‌చెరు శివారులో మంగళవారం రాత్రి హెరాయిన్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన అబ్కారీ అధికారులు సహిదూర్ రహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాక్‌అప్‌లో ఉంచారు.
అయితే బుధవారం తెల్లవారుజామున లాక్‌అప్ గిల్స్‌ను విరగొట్టి నిందితుడు పరారైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తమై అతడి కోసం గాలింపు చేపట్టారు. ఘటనపై పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎలా పరారయ్యాడు? లాక్‌అప్ గిల్స్‌ను ఎలా విరగొట్టాడు? సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: