జూ పార్క్ లో విషాద సంఘటన..

bear

Advertisements

&NewLine;<p>విశాఖ జూ పార్క్ లో సోమవారం ఉదయం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది&period; అవుట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న నగేష్ అనే యువకుడు సోమవారం ఉదయం జూ పార్క్ పరిసరాల్లో క్లీనింగ్ చేస్తుండగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది&period; ఎలుగుబంటి బోనులో ఉందనుకొని అతడు క్లీనింగ్లు చేస్తుండగా సంఘటన సంభవించింది&period; ఎలుగుబంటి బోనుకు వేసి ఉన్న తలుపులు ఎప్పుడు తీర్చుకున్నాయో&comma; ఎవరు తెరిచి ఉంచారో తెలియాల్సి ఉంది&period; జూలో ఉన్న సందర్శకులు అందరూ చూస్తుండగానే ఈ ఎలుగుబంటి ఆ యువకుడి పై దాడి చేయడం జరగడంతో సందర్శకులు భయకంపితులయ్యారు&period; సంఘటనను గుర్తించిన జూ అధికారులు వెంటనే స్పందించి ఆ ఎలుగుబంటిని బంధించారు&period; తీవ్ర గాయాల పాలైన ఆ ఉద్యోగి నగేష్ ను ఆసుపత్రికి తరలించగా అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు&period; ఈ సంఘటనతో జూలోని సందర్శకులు అంతా అయోమయానికి గురయ్యారు&period; జూలో సిబ్బంది కి&comma; సందర్శకులకు భద్రత కరువైందని ప్రజలు భావిస్తున్నారు&period; ఈ సంఘటనపై కేసు నమోదు చేసి ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..