కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయం..

amma srinivas naidu

Advertisements

&NewLine;<p>కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని గుంటూరు జిల్లా కాపు సంఘ నాయకులూ హెచ్చరించారు&period; సోమవారం నగరంలోని ఓ హోటల్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు&period; ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జెఎసి అధ్యక్షులు అమ్మ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ కాపులను గుర్తించని పార్టీ కనుమరుగవ్వడం ఖాయమని&comma; గుర్తుంచుకున్న పార్టీలకు కాపులు అండగా ఉంటారన్నారు&period; ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు&comma; 1 పార్లమెంట్ స్థానాలు కాపులకు కేటాయించాలని డిమాండు చేశారు&period; గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1 పార్లమెంట్ 2 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలన్నారు&period; 27 శాతం ఉన్న కాపులు రాష్టంలో నిర్ణయాత్మకంగా ఉన్నారని పేర్కొన్నారు&period; జనాభా దామాషా ప్రకారం కాపులకు తగిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్టంలో కేటాయించాలన్నారు&period; ఎన్నికల ముందు అలివికాని హామీలు ఇచ్చి కాపులను మోసం చేయొద్దని వారు హెచ్చరించారు&period; రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు యర్రగోపు నాగేశ్వరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించిన పార్టీకే మా మద్దతు అని అన్నారు&period; ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం&period; జిల్లా కాపునాడు అధ్యక్షులు మిరియాల గోపి కాపులకు ఏ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వటం లేదన్నారు&period; గుర్తింపు ఉన్న పార్టీ అధికారం లో లేదని&comma; అధికారంలో ఉన్న పార్టీ గుర్తించడం లేదన్నారు&period; రాష్టంలో ఏ పార్టీ అయిన గెలిచే ప్రాంతాల్లో కాపులకు సీట్లు కేటాయించాలన్నారు&period; రాష్ట్ర కాపు మహిళా నాయకురాలు పాకనాటి రమాదేవి మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 6 లక్షల మంది కాపులు ఉన్నారు&period; కాపులను గుర్తించిన పార్టీని భుజాన పెట్టుకుంటాం&period; గతంలో కాపులను నమ్మించి మోసం చేసిన పార్టీలు కనుమరుగయ్యాయన్నారు&period; బిట్రగుంట మల్లికా మాట్లాడుతూ కాపులు అత్యధికంగా ఉన్న ప్రాంతాలల్లో కాపుల ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు&period; రాజ్యాధికార దిశగా రాష్టంలో ఉన్న అన్ని కాపు సంఘాలు కాపు నాయకుల కలిసి పనిచేయాలన్నారు&period; ఈ కార్యక్రమంలో రాష్ట్రకాపు సంక్షేమ సేన జాయింట్ సెక్రటరీ వెలిదండి కోటేశ్వర రావు&comma; పివిఆర్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మి నారాయణ&comma; కాపునాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రాగం సదాశివరావు&comma; కాపునాడు గుంటూరు తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు బండి రామప్రభు&comma; తెలగ అభ్యుదయ సంఘ కార్యదర్శి డేగల వెంకటేశ్వర రావు&comma; అఖిల భారత కాపు సమాఖ్య ఉపాధ్యక్షులు బొక్కిసం శివరాం&comma; అఖిల భారత కాపు సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి మేకల బాబు రావు&comma; మెల్లం సైదయ్య&comma; బొబిలి రామారావు&comma; చింతకాయల రామారావు&comma; కలగంటి త్రిపుర సుందరావు తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..