మరోసారి తెరపైకి భారత్‌కు కోహినూర్‌ వజ్రం అంశం…

Advertisements

<p>కోహినూర్‌ వజ్రాన్ని భారత్‌కు అప్పగించే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది&period; ఐతే ప్రస్తుతం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3 అమెరికా పర్యటనలోఉన్న వేళ ఈ అంశం మరోసారి తెరపైకి రావడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది&period; చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని తాను బ్రిటన్ రాజును కోరతానని&period;&period;భారతీయ మూలాలు కలిగిన న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఈ అంశం అధికారిక ఎజెండాలో లేనప్పటికీ&comma; కింగ్ చార్లెస్‌తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు చేరాలని తాను కోరతానన్నారు&period; వలస పాలనలో వజ్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారని&comma; అది తమ దేశ చరిత్రలో ఒక విలువైన భాగమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది&period; తమ దేశ సంపదను తిరిగి ఇచ్చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది&period; అయితే&comma; 19à°µ శతాబ్దపు ఒప్పందం ప్రకారం ఆ వజ్రం చట్టబద్ధంగా తమదేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది&period; ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..

తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్ నియామకం ..