282
టీ.ఎస్.పి.ఎస్.సి చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో అశోక్ నగర్ లో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ప్రొఫెసర్ రియాజ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. టీ.ఎస్.పి.ఎస్.సి పేపర్ లీకేజ్ కారణంగా ఎంతో మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఆయన రాజీనామాతో టీ.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాళన అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బిఆర్ఎస్ ఓటమికి నిరుద్యోగులు కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుందని. నిరుద్యోగుల పోరాటానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.