100
గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జన సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీతో జత కట్టారు. ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇంతలో గవర్నర్ కోటాలో కోదండరాం, అమరుల్లా ఖాన్‌లను తమిళిసై నియమించారు.