జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ లోని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ నివాసంలో అర్ధరాత్రి విజిలెన్స్ మరియు ఐటీ దాడులు సోదాలు నిర్వహించారు. పోలీసులు వచ్చిన సమయంలో సంపత్ కుమార్ నివాసంలో లేకపోవడంతో ఆయన సతీమణి మహాలక్ష్మి భయభ్రాంతులకు గురయ్యారు. సంపత్ కుమార్ సతీమణి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ప్రచారం లో పాల్గొని ఇంటికొచ్చిన సంపత్ కుమారు తన సతీమణి ని 108 లో కర్నూలు కిమ్స్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇంట్లోకి ఎలా వెళ్తారని సంపత్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఎలాంటి డబ్బులు దొరకపోవడంతో అధికారులు వెళ్లిపోయారు. నా నివాసానికి ఐటీ అధికారులా.. ఈడి అధికారులా తేల్చాలని సంపత్ కుమార్ స్థానిక సీఐ శివశంకర్ గౌడ్ తో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో దాడులు చేసిన అధికారులు ప్రస్తుతం కనిపించడం లేదని వారు ఎక్కడున్నారని పిలవాలని పోలీసులతో సంపత్ కుమార్ చెప్పారు. సంపత్ కుమార్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులను మీడియా వివరణ కోరగా నో కామెంట్ అని పోలీసులు తెలిపారు.
సంపత్ కుమార్ నివాసంలో విజిలెన్స్, ఐటీ దాడులు
65
previous post