ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ

people-meeting-kcr-at-farm-house

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం&comma; ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు&period; చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు&period; ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు&period; తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత&comma; మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు&period; అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు&period; బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు&period; ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు&period; మరోవైపు&comma; ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు&period; దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు&comma; 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు&period; అయితే&comma; వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు&period; అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు&period; దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది&period; అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.