విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో స్కూల్‌కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది. ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు. దీంతో బీతావహ వాతావరణం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనాస్థలంలో హృదయవిదారక దృశ్యాలు కనిపించాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులు ప్రమాదానికి గురి కావడంతో స్థానికులు వెంటనే స్పందించారు. చిన్నారులకు ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో రోడ్డుపై చిన్నారులు చెల్లచెదురుగా గాయాలతో పడి ఉండటం అందరిని కలిచి వేసింది. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు.
విశాఖలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ…చిన్నారులకు గాయాలు
66
previous post