మందమర్రి మున్సిపాలిటీ మైదానం లోని 19 వ వార్డు లో జరుగుతున్న ప్రజా పాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారంటీ ల ధరఖాస్తు స్వీకారం లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా ఆరు గ్యారంటీ లను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాము. అయిదు లక్షల రూపాయల తో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, అమలు చేస్తాము అన్నారు. కొత్త రేషన్ కార్డులను ఖచ్చితంగా ఇస్తాము, అభయహస్తం ధరఖాస్తు అందరూ చేసుకునేలా చూడాలి, చెయ్యని వారి ఇంటికి అధికారులు వెళ్లాలి, ఫోన్ చేసి మాట్లాడండి. అభయ హస్తం ధరఖాస్తులను స్వీకరించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో జిల్లా చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, తహసీల్దార్ చంద్రశేఖర్, అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
136
previous post