కమలం పువ్వు గుర్తు (BJP)కు ఓటేస్తే రాముడికి వేసినట్లేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. హిందువుల 5 వందల ఏళ్ల చిరకాల వాంఛను నెరవేర్చిన నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట కేంద్రంలో నిర్వహించిన ప్రజాహిత యాత్రలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.
కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్రుందం అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి నివేదిక రూపొందించి చర్యలు తీసుకోవాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వ్రుధా చేసిన కేసీఆర్ సహా బాధ్యులను ఎందుకు అరెస్ట్ చేయలేదని, వారి ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణుల బ్రందం నివేదిక ఇచ్చిందని, విజిలెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చిన తరువాత మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బీజేపీ గెలుపు ఖాయమని తేలడంతో ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం, క్రిష్ణా నీటి పంపకాల పేరుతో పరస్పరం దూషించుకుంటూ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని మాట ఎందుకు తప్పుతున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
హిందువుల 5 వందల సంవత్సరాల చిరకాల వాంఛ అయోధ్యలో రామ మందిర నిర్మాణమని, ఆ కలను నెరవేర్చిన నరేంద్రమోదీ మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలోనే రామ మందిరం ఎందుకు కట్టారని వితండ వాదం చేస్తున్న నేతలంతా చరిత్ర తెలుసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడితే ప్రజల కోరిక మేరకు దేశంలో అనేక ఆలయాలను నిర్మిస్తామని అన్నారు.
తెలంగాణలో ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వడం న్యాయమా? అని ప్రజలను ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ నేతలు తప్పించుకునే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టిక్కెట్ కోసం కన్నకొడుకు పేరునే మార్చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ అసలు పేరు కల్వకుంట్ల అజయ్ రావు అని ఎన్టీఆర్ పేరు పెట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్న మోసగాడు కేసీఆర్ అని దుయ్యబట్టారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.