మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది. కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also..