దేశ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్న5 రాష్ట్రాల ఎన్నికలు..

Advertisements

<p>బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరింది&period; రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే&period;&period;దుర్గా స్క్వాడ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్&period; టీఎంసీ పాలనలో రాష్ట్రం అరాచకంలోకి వెళ్లిపోయిందని&comma; భయం కారణంగా పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని విమర్శించారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని&comma; బెంగాల్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అరాచకాన్ని సృష్టిస్తోందని&comma; శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు&period; రాష్ట్రంలో కట్ మనీ వసూళ్లు&comma; సిండికేట్ పాలన సాగుతోందని&comma; వాటికి ముగింపు పలకాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు&period; భద్రత లేకపోవడం వల్లే పరిశ్రమలు&comma; పెట్టుబడిదారులు బెంగాల్ వదిలి వెళ్లిపోతున్నారని&comma; మమతా బెనర్జీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని రాజ్‌నాథ్ విమర్శించారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు బెంగాల్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; మహిళా కోటా బిల్లును 2029 నుండి అమలు చేయాలని నిర్ణయించడం ద్వారా ప్రధాని మోదీ ఆ బిల్లును ఆచరణలో లేకుండా చంపేశారని ఖర్గే ఆరోపించారు&period; మహిళా రిజర్వేషన్ అనేది కేవలం ఒక సాకు మాత్రమేనని&comma; దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యాన్ని తగ్గించడమేనని విమర్శించారు&period; మోదీ ప్రభుత్వం మనుస్మృతిని అనుసరిస్తోందని&comma; అది మహిళలకు&comma; శూద్రులకు అధికారాన్ని నిరాకరిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఇక బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో అధికార TMCపై విరుచుకపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్&period; మమతా బెనర్జీ మా&comma; మాటి&comma; మానుష్ నినాదంతో అధికారంలోకి వచ్చారని&comma; కానీ నేడు బెంగాల్‌లో ఆ మూడింటికీ రక్షణ లేదని విమర్శించారు&period; ముఖ్యంగా మహిళా ముఖ్యమంత్రి ఉండి కూడా సందేశ్‌ఖాలీ&comma; ఆర్‌జి కర్ వంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు&period; మమతా బెనర్జీ నందిగ్రామ్ ఉద్యమం ద్వారానే ఎదిగారని&comma; కానీ ఇప్పుడు ఆమె అక్కడి ప్రజల ఆకాంక్షలను మరిచిపోయారని ఎద్దేవా చేశారు&period;<&sol;p>&NewLine;<p>బెంగాల్‌లోని పవిత్రమైన నేలని టీఎంసీ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు అప్పగిస్తూ అపవిత్రం చేస్తోందని ఆరోపించారు నితిన్ నబిన్&period; రాష్ట్రంలో హింసా రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని&comma; ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు నుంచి బెంగాల్‌లో కొత్త శకం ప్రారంభమవుతుందని నితిన్ నబిన్ ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు బీజేపీ స్టార్ క్యాంపైనర్‌గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; తనదైన శైలిలో టీఎంసీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు&period; బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం రామ భక్తులను అణిచివేస్తోందని&comma; దుర్గాపూజ వంటి పండుగలను జరుపుకోకుండా అడ్డంకులు సృష్టిస్తోందని యోగి ఆరోపించారు&period; బెంగాల్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు&period; ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్ఫ్యూలు&comma; అల్లర్లు లేవని&period;&period; బెంగాల్‌లో కూడా శాంతి నెలకొనాలంటే మార్పు అవసరమని స్పష్టం చేశారు&period; యూపీలో మాఫియాలను ఎలాగైతే అణచివేశామో&comma; బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అకృత్యాలకు పాల్పడేవారిని&comma; బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసే గుండాలను వదిలిపెట్టబోమని యోగి హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలోకి దిగారు&period; తమిళనాడు ఎన్నికల ప్రచారంలో బాబు పాల్గొన్నారు&period; నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో ప్రాబల్యం కోల్పోతాయని డీఎంకే&comma; కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు&period; లోక్‌సభ స్థానాల సంఖ్య 50 శాతం పెరిగితే అది అన్ని రాష్ట్రాలకూ సమానంగా మేలు చేస్తుందని ఆయన వివరించారు&period; జనాభా నియంత్రణ పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు గతంలో అటల్ బిహారీ వాజపేయి సీట్ల పెరుగుదలను నిలిపివేశారని&comma; ఇప్పుడు కూడా కేంద్రం దక్షిణాది ప్రయోజనాలను కాపాడుతుందని హామీ ఇచ్చారు&period; తమిళనాడులో డీఎంకే కుటుంబ పాలన సాగుతోందని&comma; దానివల్ల సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు&period; అభివృద్ధిపై దృష్టి పెట్టే ప్రభుత్వానికి పట్టం కట్టాలని చంద్రబాబు ఓటర్లను కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.