మాతో నీకేం పని బాబు…

AP Minister Meruga Nagarjuna

Advertisements

&NewLine;<p>టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకూ అందరూ కలిసి పని చేస్తామని&comma; ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు&period; విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా&comma; ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు&period; ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ&period;&period; రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని&comma; అయితే అధిష్టానం నిర్ణయం మేరకూ అందరు కలిసి పని చేస్తామని&comma; రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు&period; చంద్రబాబు&comma; అతని టీం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని&comma; మాతో చంద్రబాబుకు ఏం‌ పనో అర్ధం కావడం లేదని&comma; చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు&period; చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో&comma; లోకేష్ ఎందుకు మంగళగిరిలో‌ పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు&period; ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని&comma; చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చక పోవడం వల్లే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నారని&comma; పవన్ ను మళ్ళీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పని లేదని&comma; మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వేరే చోట పని చేయబోతున్నారే గానీ&comma; మా పార్టీలో అమర్‌నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపి మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.