ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వం…..

Where is this crazy government?

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం&comma; మానుకొండవారిపాలెంలో తుఫాన్ కు దెబ్బతిన్న శనగ&comma; పొగాకు&comma; మిరప&comma; వరి కల్లాలను తెదేపా రాష్ట్ర బృందంతో కలిసి మాజీమంత్రి&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు&period; అనంతరం రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు&period; ఈ సందర్భంగా ప్రత్తిపాటి మీడియాతో మాట్లాడుతూ రైతుకు భరోసా కల్పించి ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం ఇప్పించేందుకు వచ్చామన్నారు&period; అన్నదాత కష్టాల్లో ఉంటే దెబ్బతిన్న పంటల పరిశీలనకు చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జగన్‌రెడ్డి కదిలారని మండిపడ్డారు&period; ఎక్కడా కూడా పొలాల్లోకి దిగిన దాఖలాలు లేవన్నారు&period; కాలికి మట్టి అంటకుండా తిరిగితే రైతుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు&period; పంట నష్టపోయి అన్నదాతలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే జగన్‌కు ఎవరిని ఎక్కడికి మార్చాలి&period;&period; మళ్లీ అధికారంలోకి రావాలనే ధ్యాస తప్ప మరొకటి లేదన్నారు&period; ఏ పంటకు ఎంత నష్టపరిహారం ఇస్తారో ప్రకటనే చేయలేదన్నారు&period; ఇన్‌పుట్ సబ్సిడీ&comma; ఈ-క్రాపింగ్ ఎంత బుక్ చేశారో కూడా చెప్పడం లేదని… ఇదెక్కడి దిక్కుమాలిన ప్రభుత్వమో అర్థం కావడం లేదన్నారు&period; పంట దెబ్బతిన్న 22 లక్షల ఎకరాల్లో ఈ-క్రాపింగ్ బుకింగ్ ఎంత వస్తుంది&period;&period; రాని వారికి&comma; కౌలుదార్లకు ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే వాటిపైనా ఏమీ చెప్పలేదని ఆందోళన వ్యక్తం చేశారు&period; సంక్రాంతి లోపు చెల్లిస్తామని చెబుతున్నారని&period;&period; ఈలోపు ఇవ్వకపోతే జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చి జగన్‌రెడ్డి తప్పించుకునే అవకాశం ఉందన్నారు&period; కాబట్టి తక్షణమే రైతులకు నష్టపరిహారం ప్రకటించాలని&comma; తడిసినధాన్యం&comma; మిరప కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు&period; ఈ సందర్భంగానే వైకాపాలో అభ్యర్థుల మార్పులపైనా చురకలు వేశారు&period; చెల్లని రూపాయి ఎక్కడ ఉన్నా చెల్లనిదే అని అన్నారు&period; స్థానాలు మార్చినంత మాత్రాన వాళ్ల అవినీతి&comma; అక్రమాల చరిత్రలు చెరిగిపోవు అన్నారు&period; చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని చేసిన అవినీతి&comma; దుర్మార్గాల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని చెప్పారు&period; ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడుగురిని మార్చారని&period;&period; అభ్యర్థులను మార్చినంత మాత్రానా వారు చేసిన అవినీతి&comma; దుర్మార్గాలు ఎక్కడిపోతాయని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..