ఏ సీటు ఎవరికో ?

Which seat belongs to whom

Advertisements

&NewLine;<p>డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రాధాన్యత&comma; ప్రాముఖ్యత&comma; విశిష్టత ఉన్న నియోజకవర్గం రామచంద్రపురం&period; గతంలో ఈ నియోజకవర్గానికి రెండు వర్గాలు ప్రాతినిధ్యం వహించేవి&period; ఇప్పుడు సీను మారింది&period; ఎవరికి వారే యమునా తీరేగా మారిపోయారు&period; గతంలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్&comma; ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యర్థులుగా ఉండి పోటీపడేవారు&period; ఒకసారి తోట నెగ్గితే మరోసారి బోసు నెగ్గె వారు&period; వైసిపి ఏర్పడ్డ అనంతరం కూడా వీరిద్దరి మధ్య వివాదాలు&comma; పోటీలు జరిగాయి&period; అనంతర పరిణామాల్లో అనూహ్యంగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరారు&period; దీంతో బద్ధ శత్రువులైన బోస్&comma; త్రిమూర్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది&period; అయినప్పటికీ ఇద్దరు ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు&period; త్రిమూర్తులు టిడిపిలో ఉన్నప్పుడు బోసు భార్యపై ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు కేసు పెట్టారు&period; ఎస్ ఎస్ టి కేసులు కూడా బోస్ కుటుంభం పై పెట్టించారు&period; అదే విధంగా త్రిమూర్తులు తన పార్టీలో చేరినప్పటికీ ఆయన తనకు ప్రత్యర్థి అని బోసు బహిరంగంగా వాదించారు&period; వీరిద్దరినీ కాదని వైసిపి అధినేత జగన్ రామచంద్రపురం టికెట్ 2019 ఎన్నికల్లో కోనసీమకు చెందిన చెల్లుబోయిన వేణుకు ఇచ్చారు&period; ఆయన విజయం సాధించారు&period; మంత్రి అయ్యారు&period; దీంతో మంత్రి వేణు అటు బోస్&comma; ఇటు త్రిమూర్తులకు చెక్ పెట్టారు&period; తన పవర్ పెంచుకున్నారు&period; ఇలాంటి నేపథ్యంలో బోసు కుమారుడు రామచంద్రపురం టికెట్ తనదేనంటూ వైసీపీలో ప్రత్యేక కుంపటి పెట్టారు&period; దీనితో వేణు&comma; బోసు మధ్య ఒకే పార్టీలో ఉంటూ ఒకరిపై మరొక ఆరోపణలు&comma; సవాళ్లు&comma; ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి&period; తోట త్రిమూర్తులు టిడిపిని వదిలేసిన తర్వాత చాలాకాలం ఆ పార్టీకి ఇంచార్జి లేరు&period; దీంతో కోనసీమ జిల్లాకి చెందిన శాసనమండలి మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు&period; కొంతకాలం ఆయన అసమ్మతి లేకుండా నెట్టుకు వచ్చారు&period; ప్రస్తుతం టిడిపి ఇన్చార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం వై సి పి కి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి వేణు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు&period; పైగా వీరు ఇరువురు మంచి స్నేహితులు&period; వీరు ఇరువురు కాంగ్రెస్ లో కలిసి పనిచేసినప్పుడు కాంట్రాక్ట్ లు కూడా చేశారు&period; వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగేవి&period; ఈ నేపథ్యంలో రెడ్డి సుబ్రమణ్యంకు టిడిపి టికెట్ ఇస్తే తాము పని చేయమంటూ శెట్టిబలిజ సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చింది&period; మరోపక్క జనసేన ఈ సీటు పై కన్నేసింది&period; ప్రస్తుతం రామచంద్రపురం ఇన్చార్జిగా ఉన్న పోలిశెట్టి చంద్రశేఖర్ కు పార్టీలోనూ ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లేదు&period; దీంతో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యాపారవేత్త చిక్కాల దొరబాబును జనసేనలోకి తీసుకువచ్చారు&period; రామచంద్రపురాన్ని పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారు అన్న ప్రచారం జరుగుతోంది&period; శెట్టిబలిజ సామాజి వర్గానికి టికెట్ ఇస్తే ముమ్మిడివరానికి చెందిన జనసేన నేత పితాని బాలకృష్ణ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కొత్తగా చేరిన చిక్కాల దొరబాబుకు టిక్కెట్టు ఖరారు అని చెప్తున్నారు&period; అయితే పితాని వద్ద ఆర్థిక బలం లేదు&period; ఈ రెండు దొరబాబు వద్ద ఉన్నాయి&period; దీంతో రెడ్డి సుబ్రహ్మణ్యానికి&comma; ఆయన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టేందుకు ఈ టిక్కెట్టు జనసేనకు వదిలేయాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం&period; అదే జరిగితే దొరబాబు జనసేన తరపు అభ్యర్థి అవుతారు&period; బోస్ లేదా ఆయన తనయుడు వైసిపి నుంచి పోటీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి&period; మంత్రి వేణును రాజమండ్రి ఎంపీ లేదా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా పంపిస్తారని నాయకులు చెబుతున్నారు&period; ఈ నేపథ్యంలో బోస్ లేదా ఆయన తనయుడును బలంగా ఢీకొనే సత్తా జనసేనకు దక్కుతుంది&period; మరోపక్క రెండు పార్టీల్లో ఉంటూ స్నేహితులుగా లాలూచీ రాజకీయాలు చేస్తున్న రెడ్డి సుబ్రహ్మణ్యం&comma; వేణులకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది&period; ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.