విలేఖరివైతే ఎవరికి ఎక్కువ..

Chicken fights

Advertisements

&NewLine;<p>పల్నాడుజిల్లా నరసరావుపేటలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో కోడిపుంజుల కొట్లాట ప్రదర్శన నిర్వహించారు&period; విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యా సంస్థలే వారిని పక్కదారి పట్టించే వైనం చేశారు&period; గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సంక్రాత్రి సంబరాల్లో నిషేధించబడిన కోడి పందాలు ప్రదర్శనతో నివ్వెర బోయిన తల్లిదండ్రులు&comma; ఇప్పటివరకు రహస్యంగా ఎక్కడో నిర్వహించే కోడిపందాలని విద్యాలయంలో విద్యార్థుల ఎదుటనే ప్రదర్శించటం అమానుషం గా ఏర్పడింది&period; వైసిపి నాయకులు అండదండలు ఉన్న కారణంగా దీనిపై పోలీసులు&comma; జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం&comma; దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ కి వివరణ కోసం ఓ విలేఖరి ఫోన్ చేయగా ప్రిన్సిపాల్ సానుకూలంగా స్పందించి&comma; కోడిపందాల ప్రదర్శన మేము చేపించలేదు స్కూల్ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి మాగులూరి రమణారెడ్డి చేపించారంటూ ప్రిన్సిపల్ అన్నారు&period; సదురు స్కూల్ డైరెక్టర్ నాకు కాల్ చేసి నాతో ఎలా పడితే అలా మాట్లాడి నీ అంతు చూస్తానంటూ&comma; 10 మందిని రౌడీలను పంపించి నిను చంపుతాను అంటూ నాకు బెదిరింపులకు గురి చేశారన్నారు&period; విలేఖరివైతే ఎవరికి ఎక్కువ అంటూ ఫోన్లో ఎలా పడితే అలా దుర్భాషలాడి&comma; దీనిపై వార్త రాస్తే చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు&period; స్కూల్ డైరెక్టర్ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రెస్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు&period;&period; జర్నలిస్టులపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిలపై చర్యలు తీసుకోవాలని DSP కి ఫిర్యాదు చేసిన జర్నలిస్టుల సంఘం&period;&period; జర్నలిస్ట్ లపై దాడికి పాల్పడినా&comma; దుర్భాషలాడిన కఠిన చర్యలు తప్పవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించినప్పటికి కూడా జర్నలిస్టులపై ఆగని దాడులు&comma; దీనిపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేట జర్నలిస్ట్ సంఘం తరుపున తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..