Anakapalli:
అనకాపల్లి లోక్ సభ(Lok Sabha) స్థానానికి అభ్యర్థిని వైసీపీ(YCP) ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలోకి దించింది. ఇప్పటి వరకు వైసీపీ 175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఈ స్థానంలో ముత్యాలనాయుడిని నిలబెట్టారు. ముత్యాలనాయుడు ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను ఇప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి మార్చారు. మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ను ఈర్లి అనురాధకు ఇచ్చారు. ముత్యాలనాయుడు కూతురే అనురాధ. బూడి ముత్యాలనాయుడు(Budi Mutyalanaidu) కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందినవారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: తిరువూరులో దొంగల హల్చల్…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి