గండేపల్లి మండలం ఎన్ టి రాజా పురం గ్రామం గండేపల్లి జడ్పిటిసి సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతాయారు, పరిమి బాబు దంపతులు ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్, పరిమిరాజు, సుంకవిల్లి రమేష్ తదితర 1000 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా ఎన్టీ రాజాపురం చేరుకున్న జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరిమి బాబు మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి మళ్లీ ఈ పార్టీలో చేరుతున్నానని అన్నారు. నెహ్రూ మాట్లాడుతూ నా మిత్రులందరికీ ఈ మూడు నెలల కాలం నుంచి మళ్లీ నా వద్దకు వస్తున్నారని ఇంకా అనేకమంది రావడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కూడా ఆహ్వానించుకోవాలని అన్నారు. విధ్వంసకర పాలన చేస్తున్న జగన్ రెడ్డిని గద్దించటానికి ఈ రోజు టిడిపి, జనసేన, బిజెపి కలిసి పనిచేస్తున్నాయని చంద్రబాబు ఒక నిబద్ధతతో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారని, పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలగా పేదలకు మంచి జరగాలని ఈ అవినీతి ప్రభుత్వం గద్దె దిగాలని పోరాటం చేస్తున్నారని అన్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం పెడితే జగన్ రెడ్డి ప్రజా వేదిక కుల్చడానికి సంతకం పెట్టి ఆరోజు ఆకలి రాక్షస ఆ రోజు రాక్షస పరిపాలనకు శ్రీకారం చుట్టాడని టిడిపి పుట్టిందే ప్రజలకు సంక్షేమం అందించడానికి అని కూడు గుడ్డ నీడ నినాదంతో, పేదలకు పింఛన్ పథకంతో రైతులకు 50 రూపాయలకే ఆస్పవర్ అందించి సంక్షేమానికి శ్రీకారం చుట్టారని అన్నారు.
టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ కార్యకర్తలు…
79
previous post