పరీక్షల సమయంలో వైయస్సార్ ఆసరా పంపిణీ సభ..

Women's Degree College

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న సమయంలో అధికారులు వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది&period; ఒకవైపు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా మరోవైపు మహిళలకు రుణమాఫీ నిమిత్తం అమలు చేస్తున్న వైయస్సార్ ఆసరా పంపిణీ సభను ఏర్పాటు చేశారు&period; ప్రభుత్వ కార్యక్రమాలు అయినప్పటికీ ఏదైనా విద్యాసంస్థలో ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులను తెలుసుకొని విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులను లేదా ప్రధాన అధ్యాపకులను సంప్రదించి అనుమతి తీసుకుని నిర్వహించవలసి ఉంటుంది కనీస సమాచారం లేకుండానే కళాశాలలో సభ ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పాలయ్యారు&period; భారీ మైకు మోతలు ఒకవైపు సభకు భారీ సంఖ్యలో హాజరైన డ్వాక్రా మహిళల రణగొణ ధ్వనులు మరోవైపు మోగిపోవడంతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు అసహనానికి గురయ్యారు&period; వాస్తవానికి సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో జరగనున్నప్పటికీ ముందుగానే సభికులు&comma; మైక్ సౌండ్లు ప్రారంభం కావడంతో సర్వత్ర విమర్శలు వెల్లు వెల్లుతున్నాయి&period; 12 గంటలకు పరీక్ష పూర్తవుతున్నందున మధ్యాహ్న సమయంలో సభ నిర్వహించుకుని ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండకపోనని పలువురు అభిప్రాయపడుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.