115
దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి అంబులెన్సులో ఆయన దుబ్బాకకు వచ్చారు. ఆయన సహాయకులు వీల్ ఛైర్ లో ఆయనను రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు తీసుకెళ్లారు. అంతకు ముందు దుబ్బాకలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. అక్టోబర్ 30న దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డిలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై గటాని రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి ఆయన పొత్తికడుపులో పొడిచాడు.