ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది.

Advertisements

<p>ఇండియన్ ప్రీమియర్ లీగ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చేతులు మారింది&period; ఆదిత్య బిర్లా గ్రూప్&comma; టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును 1&period;78 బిలియన్ డాలర్లకు అంటే&period;&period;సుమారు రూ&period; 16&comma;725 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది&period; ఆదిత్య బిర్లా&comma; టైమ్స్ గ్రూప్‌లతో పాటు బోల్ట్ వెంచర్స్&comma; బ్లాక్‌స్టోన్ సంస్థలు ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నాయి&period; ఆర్సీబీ ఫ్రాంచైజీలో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తో ఈ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం&period; ఈ డీల్‌లో ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు&comma; ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మహిళల జట్టు కూడా ఉన్నాయి&period; కొత్త యాజమాన్యంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమన్ విక్రమ్ బిర్లా చైర్మన్‌గా&comma; టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కు చెందిన సత్యన్ గజ్వానీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు&period; అయితే&comma; ఈ కొనుగోలుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి &comma; ఐపీఎల్&comma; డబ్ల్యూపీఎల్ పాలకమండలుల నుంచి అధికారిక అనుమతులు లభించాల్సి ఉంది&period;కొన్ని నెలల క్రితం ఆర్సీబీ మాతృసంస్థ డయాజియో పీఎల్‌సీ ఈ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టింది&period; కాగా&comma; ఒకే సమయంలో ఐపీఎల్ &lpar;2025&rpar;&comma; డబ్ల్యూపీఎల్ &lpar;2026&rpar; టైటిళ్లను గెలుచుకున్న ఏకైక ఫ్రాంచైజీగా ఆర్సీబీకి ప్రత్యేక గుర్తింపు ఉంది&period; గతంలో విజయ్ మాల్యా ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకోగా&comma; యునైటెడ్ స్పిరిట్స్ సంస్థను డయాజియో టేకోవర్ చేయడంతో ఆర్సీబీ యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.

గగన్‌యాన్ మిషన్‌లో కీలక మైలురాయి సాధించిన ఇస్రో.

HPCL గ్యాస్ ప్లాంట్‌లోకి వరద నీరు.