ఇజ్రాయెల్ కు మద్దతు పలికిన – కంగనా

kangana

Advertisements

&NewLine;<p>బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇజ్రాయెల్ కు సంఘీభావం ప్రకటించారు&period; ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబారి నార్ గిలాన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు&period; ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రాయబారితో తన సంభాషణ వీడియో క్లిప్ ను ట్విట్టర్ లో ఆమె షేర్ చేసింది&period; ఇజ్రాయెల్ లో తాజా పరిస్థితులపై ఆమె ఆ దేశ రాయబారితో చర్చించింది&period; ఇజ్రాయెల్ కు తన పూర్తి మద్దతు పలికింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నా హృదయం ఇజ్రాయెల్ చుట్టూనే తిరుగుతోంది&period; మా హృదయాలూ రక్తమోడుతున్నాయి’’అంటూ వీడియో క్లిప్ ను పోస్ట్ చేసింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఇజ్రాయెల్ కు&comma; యూదులకు నా మద్దతు విషయమై నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడుతుంటాను&period; హిందువులు శతాబ్దాలుగా మారణ హోమం ఎదుర్కొంటున్న మాదిరే యూదులకూ అదే పరిస్థితి ఎదురవుతోంది&period; భారత్ హిందులకు ఎలా ప్రత్యేకమే&comma; యూదులకు కూడా ప్రత్యేక దేశం ఉండాల్సిందే’’అని పేర్కొంది&period; హమాస్ ను నేటి రావణాసురగా కంగనా అభివర్ణించింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;నేడు ఇజ్రాయెల్&comma; భారత్ ఉగ్రవాదంపై పోరాడుతున్నాయి&period; రావణ దహనం కోసం నేను నిన్న ఢిల్లీకి రాగా&comma; ఇజ్రాయెల్ ఎంబసీకి వెళ్లి&comma; నేటి కాలపు రావణ&comma; హమాస్ వంటి ఉగ్రవాదులతో పోరాడుతున్న ఇజ్రాయెలీలో భేటీ అవ్వాలనుకున్నాను&period; చిన్నారులు&comma; మహిళలను లక్ష్యంగా చేసుకోవడం హృదయాలను పిండేస్తోంది&period; ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది’’అని కంగనా రనౌత్ తన అభిప్రాయాలను పంచుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..